ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఎంపీడీఓ కార్యక్రమంలో మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అన్నం మంగ అధ్యక్షతన మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో వాడివేడిగా జరిగింది.పలు గ్రామాల సర్పంచ్ లు జీపీలకు వచ్చిన నిధులను తమకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు ఖర్చు చేస్తున్నట్లు ఎంపీఓ ప్రసాద్,ఎంపిడిఓ నాగేశ్వర్ రెడ్డి లను నిలదీశారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే ఈ సమావేశంలో మాత్రమే అధికారులు తమకు కనిపిస్తున్నారని ఆ తర్వాత గ్రామాల్లోకి రావడం లేదని,ఒకవేళ వచ్చిన కూడా సర్పంచ్ లకు, ఎంపీటీసీ లకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.తిమ్మాపూర్ లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఎంపీటీసీ గడుసు స్వప్న మండిపడ్డారు.కొత్త కొమ్ముగూడెం సర్పంచ్ బండి సత్తయ్య,కొత్తూరు సర్పంచ్ సొల్లు సురేష్,జెండా వెంకటాపూర్ సర్పంచ్ ఎల్తాపు సునీత లు సర్పంచ్ లు నిధులు లేకపోవడంతో గ్రామాల్లో పనులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం నిధులను అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా వారికి ఇష్టం వచ్చిన పనులకు కేటాయిస్తే సర్పంచ్ లుగా మేము ఎందుకు అని ప్రశ్నించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి నాగవత్ స్వామి ఆ శాఖ ఎజెండా ఖర్చు వివరాలు లేకుండా సమావేశానికి రావడం విడ్డురంగా ఉందని జడ్పీటీసీ ముత్తే సత్తయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సయిజ్ అండ్ ప్రోహిబిషన్ అధికారులు దేవాలయాల దగ్గర మద్యం అమ్మకాలు జరుగకుండా గట్టి చర్యలు చేపట్టాలని జడ్పీటీసీ ఆదేశించారు. సర్పంచ్ ల నిధులు వారికి తెలియకుండా ఖర్చు చేయడం పై జడ్పీటీసీ అధికారులను నిలదీశారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు యూనిఫామ్ లు ధరించడంలో ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం పై సర్పంచ్ లు, ఎంపీటీసీ ఏం ఈ ఓ రవీందర్ ను ప్రశ్నించడంతో ఇకపై పాఠశాలల్లో విద్యార్థులు యూనిఫామ్ ధరించేలా చర్యలు చేపడతామన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ సంఖ్యలో కాన్పులు అయ్యేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు.ఈ సమావేశానికి అధిక సంఖ్యలో సర్పంచ్ లు,ఎంపీటీసీ గైర్హాజరవ్వగా,4 శాఖల ఆధికారులు మినహా అందరూ హాజరైనారు.ఈ సమావేశంలో డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య,జడ్పీటీసీ ముత్తే సత్తయ్య,వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,తహసీల్దార్ జోత్స్న,ఎంపిడిఓ నాగేశ్వర్ రెడ్డి, ఏవో ప్రభాకర్,పీఆర్ ఏఈ శృతి, సీడీపీఓ రేష్మ ఆయా శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.