.
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. మంగళవారం అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జడ్పి ఛైర్పర్శన్ విజయలక్ష్మి రాంకిషన్, జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి లతో కలసి
సారంగపూర్ మండలం,జామ్ గ్రామంలో రూ. 2 కోట్ల 5 లక్షల తో నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం నూతన కళాశాల భవనాన్ని ప్రారంభించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నే విద్యా, వైద్యo, వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కనబడుతూ ఉన్నాయని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాలికలకు పదవ తరగతి తరువాత ఇంటర్ మీడియట్ విద్య కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో కెజిబివీ లలోనే ఇంటర్మీడియట్ వరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాలురతో సమానంగా బాలికలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతోనే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు కూడా ఏర్పాటు అయినట్లు, మన జిల్లాలోని 18 కెజిబివీలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో వాటికి నూతన భవనాలను నిర్మిస్తోందని ఈ సంధర్భంగా గుర్తుచేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ, విద్యార్థినులు అందరు చక్కగా చదువుకొని, భవిష్యత్తు లో భావి భారత శాస్త్రవేత్తలు, డాక్టర్ లు, ఇంజనీర్ లు, విద్యావేత్తలు కావాలని, అందుకు ఉత్తేజ పూరిత కళాశాల వాతావరణం తోడ్పడుతుందని తెలిపారు.
జాం 18 కెజిబివీలో పదవ తరగతి వరకు 384 మంది విద్యార్థినులు, కళాశాల స్థాయి లో 152 మంది విద్యార్థినులు చదువు తున్నారని, వీరు నూతన భవనం లో, అన్నీ సదుపాయాలతో కూడిన వాతావరణం లో చక్కగా చదివి జిల్లా పేరును నిలబెట్టాలని తెలియ జేశారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థినులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాం రెడ్డి, సారంగపూర్ జడ్పిటిసి పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సారంగపూర్ ఎంపిపి మహిపాల్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ అశ్రిత శ్రీనివాస్ రెడ్డి, మండల ఇంచార్జి అల్లోల మురళీధర్ రెడ్డి, సర్పంచ్ మురళి కృష్ణ, పరీక్షల సహాయ కమీషనర్ పద్మ, కెజిబివీల జిల్లా సమన్వయకర్త శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు…