సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేయాలి

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:ఈరోజు తేదీ 21 ఫిబ్రవరి 2023సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్‌ టి ఐ యాక్ట్‌ అవగాహన కొరకు కరపత్ర ఆవిష్కరణకు జాతీయ చైర్మన్‌ డాక్టర్‌ శ్రీ బొమ్మరబోయిన కేశవులు అధ్యక్షత వహించి మాట్లాడుతూ యావత్‌ భారత దేశంలో అన్ని రాష్ట్రాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేసి విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా ప్రభుత్వాలు అందించడానికి నా వంతు బాధ్యతగా మా కార్యకర్తలతో కలిసి కార్యోన్ముఖులమై ఉన్నామని తెలిపారు గౌరవనీయులు డాక్టర్‌ శ్రీ బండ ప్రకాష్‌ డిప్యూటీ చైర్మన్‌ శాసనమండలి తెలంగాణ వారి చేతుల మీదుగా కరపత్రాన్ని ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని సామాన్యులు ఉపయోగించుకున్న నాడు ప్రజలే ప్రభువులుగా మారే అవకాశం ఉందని తెలిపారు అలాగే ఆర్‌ టి ఐ యాక్ట్‌ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆర్‌ టి ఐ మాజీ చీఫ్‌ కమిషనర్‌ డాక్టర్‌ శ్రీ వర్రె వెంకటేశ్వర్లు అతిథులుగా మాట్లాడుతూ ప్రజలు తమ హక్కులను సవ్యంగా ఉపయోగించుకున్న నాడు మన సమాజంలో ఎలాంటి ఒడుదుడుకులు తలెత్తవని అలాగే కోర్టుల పైన భారం కూడా తగ్గుతుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ అపెక్స్‌ కమిటీ కన్వీనర్‌ శ్రీ వైద్యం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు సమాచార హక్కు చట్టాన్ని అవగాహన చేసుకుని ఉపయోగించు ఉన్నప్పుడు ఈ దేశం అన్ని రంగాల్లో లంచగొండితనాన్ని చాలా వరకు అంత మొందించగలమని తెలిపారు జాతీయ కోఆర్డినేటర్‌ శ్రీ గాదం ఉత్తరయ్య గారు మాట్లాడుతూ విద్యా వైద్యం ప్రభుత్వాలు ఉచితంగా ఇవ్వాల్సిందిగా కోరారు అలాగే రాష్ట్ర కన్వీనర్‌ శ్రీ బండ మీది అంజయ్య గారు మాట్లాడుతూ యావత్‌ తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కమిటీలను వేసి ఆర్టిఐ యాక్టర్‌ విస్తృతస్థాయిలో ప్రజల్లోకి అవగాహన కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో విద్యావేత్త పుప్పాల సత్యం రంగారెడ్డి కన్వీనర్‌ యాదగిరి హైదరాబాద్‌ కన్వీనర్‌ అమృత రావు వంగల అవినాష్‌ వీరస్వామి లలిత గారు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking