ఎసిపి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21 : రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్రపోష గూడెం, తాళ్లపెట గ్రామంలో మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ ఎస్సై సాంబ మూర్తి,పోలీస్ సిబ్బంది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించగా మంచిర్యాల డిసిపి కేకన్ సుదీర్ రాంనాథ్ ఐపీఎస్ హాజరయ్యారు.యువకులు సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని డీసీపీ కేకన్ సుదీర్ ఐపిఎస్ యువత కు,ప్రజలకు సూచించారు. కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమంలో భాగంగా తట్రపోష గూడెం గ్రామం లో గ్రామస్థులతో సమావేశమయ్యారు.యువత, ప్రజలతో మాట్లాడినప్పుడు గ్రామంలోని యువత ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యే కు సంబంధించిన పుస్తకాలు తో కూడిన పుస్తకాలు లైబ్రరీ ఏర్పాటు చేయాలని,స్థానికన్నంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తెలపడంతో సంబంధిత ప్రభుత్వ శాఖ వారితో మాట్లాడి పరిష్కారం చేయడం జరుగుతుందని డీసీపీ వారికి తెలపడం జరిగింది.డీసీపీ మాట్లాడుతూ… పోలీసులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఎలాంటి సమస్య ఉన్న చట్టపరిధిలో పరిష్కరించడం జరుగుతుందని అదేవిధంగా ఇతర సమస్యలేమైనా ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసులు ధ్యేయమన్నారు.ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100 కు సమాచారం అందించాలన్నారు.ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధికి సహకరించాలని కోరారు.యువత, ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దన్నారు.సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండా లని, బ్యాంకు ఖాతా వివరాలు,ఏటీఎం, ఓటీపీ వివరా లను చెప్పవద్దన్నారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.గ్రామంలోకి ఎవరైనా కొత్త వారు వస్తే ఆశ్రయం ఇవ్వద్దన్నారు.మావోయిస్టుల ప్రలోభాలకు ఆకర్షితులు కావద్దన్నారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని,ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు.యువతకు వాలీబాల్ కిట్స్ ని డిసిపి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏసీపీ తిరుపతి రెడ్డి,మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొనడం

Leave A Reply

Your email address will not be published.

Breaking