వేంపల్లి గోదావరి తీరంలో ఇసుక రీచ్ ను ప్రారంభించిన,ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 18 : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వెంపల్లి గోదావరి తీరంలో ఇసుక రీచ్ ను శనివారం జాయింట్ కలెక్టర్ తో కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ…ప్రస్తుతం వేంపల్లి గోదావరి నదిలో రీచ్ ప్రారంభం కావడంతో అందుబాటు ధరలో నాణ్యమైన ఇసుక లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనింగ్ అధికారులు,ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివస్,వైస్ ఎంపీపీ బెతు రమాదేవి రవి, జడ్పిటిసి ఫుస్కురి శిల్ప శ్రీనివాస్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు మోగిలి శ్రీనివాస్,పిఎసిఎస్ చైర్మన్ సందేల వెంకటేష్,సర్పంచ్ వోలపు శారదా-రమేష్, ప్రజాప్రతినిధులు ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking