గొప్ప పర్యాటక ప్రాంతంగా జగిత్యాల ఖిల్లా’ను  తీర్చిదిద్దుతాం

ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ ను ప్రభుత్వ అనుమతికై పంపుతాం

జగిత్యాల ఖిల్లా పూర్వ వైభవం కృషి చేస్తాం

జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

జగిత్యాల, మార్చి 18,(ప్రజాబలం ప్రతినిధి)శతాబ్దాల క్రితం నిర్మించిన, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ‘జగిత్యాల ఖిల్లా’ను పర్యాటక ప్రాంతంగాఅభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వానికి నివేధిస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు. శనివారం జగిత్యాల ఖిల్లా ను అభివృద్ది చేసే లక్ష్యంతో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ మందా మకరంద్ తో కలిసి ఖిల్లా ప్రస్తుత పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఖిల్లా ప్రత్యేకత ను జిల్లా కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

సాంస్కృతిక, చారిత్రక వారసత్వం గల జగిత్యాల ఖిల్లా అర్కిటెక్చర్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా పురావస్తు శాఖ నిపుణుల సహాయంతో చారిత్రక ప్రాశస్త్యం, వైభవం ఉట్టిపడేలా పర్యాటకులను అమితంగా ఆకర్షించేలా జిల్లాకు అస్సెట్ గా ఖిల్లా ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం పర్యాటక పరంగా జగిత్యాల కోటను మరింత అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ, మున్సిపల్, ఇతర ప్రభుత్వ శాఖల సహకారం, సమన్వయంతో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డిపిఆర్)ను త్వరలో సిద్ధం చేసి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ప్రభుత్వము నుంచి ఆమోదం రాగానే పేరెన్నికగన్న అర్కియాలజిస్ట్ లు, ల్యాండ్ స్కేపింగ్ నిపుణుల సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. వీలైనంత వేగంగా పనులు పూర్తి చేసి ఖిల్లా వైభవాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేస్తామని చెప్పారు. రాబోయే కాలం లో టూరిజం హబ్ గా ఖిల్లానుమారుస్తామని అన్నారు.క్షేత్ర పర్యటనలో వెంట స్థానిక మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఆర్డీఓ మాధురి, డిఎఫ్ఓ వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ నరేష్ , డి.ఆర్.డి.ఓ.పి.డి లక్షి నారాయణ, అర్కియాలజి ఎడి సాగర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking