హైదరాబాద్ మార్చ్18 ;నల్లకుంట డివిజన్లోని ఫివర్ హాస్పటల్ చౌరస్తా వద్ద రిన్సి మినిస్ట్రీ సొసాయిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం బాలరాజు ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ వై.అమృత ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ తన స్వంత ఖర్చుతో చలి వేంద్రము ఏర్పాటు చేయటం చాలా సంతోషమని,ఫీవర్ హాస్పిటల్ ప్రక్కన చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయటం వల్ల హాస్పిటల్ కి వచ్చే రోగులు,రోడ్ పైన వెళ్లే పాదచారులు వాహన దారులు తమ దాహార్తిని తీర్చుకోవచ్చు అన్నారు.అనంతరం సంస్థ అద్యక్షుడు గంధం బాలరాజు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా రక్త దాన శిబిరాలు,అనాధలకు పుస్తకాలు,భోజనము వారికి మందులు,దుస్తులు ఏర్పాటు చేయటం తమ సంస్థ లక్ష్యం అని అన్నారు.ఈ కార్యక్రమం లో హాస్పిటల్ సిబ్బంది చంద్ర శేఖర్,నరేందర్,అనిల్,నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు