సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తమవ్వాలని, ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుటు ఒకటికి రెండుసార్లు సంస్థ మూలాలను ఖరారు చేసుకోవాలని విపణి గ్రూప్ అధినేత పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేషంలో తమ సంస్థ విపణి గ్రూప్ పేరుతో జరిగిన సైబర్ నేరాల గురించి వివరించారు.
గత ఎనిమిదేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కంపెనీలతో B2B అనుబంధం కలిగి ఉంది విపణి గ్రూప్. ఎన్నో దేశాలలోని మల్టీ నేషనల్ కంపెనీలకు ట్యాలెంట్ సపోర్ట్‌ను అందిస్తూ వస్తోంది. ఐటీ, ఇంజినీరింగ్, ఫార్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో దాదాపు ఐదు వందల కంపెనీలకు మన హైదరాబాద్ కేంద్రంగా B2B సేవలు అందిస్తోంది. ఇటీవల కాలంలో ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా కొందరు సైబర్ నేరగాళ్ళు విపణి గ్రూప్ కంపెనీ పేరును వాడుతూ కొన్ని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని తెలిసింది. సోషియల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఏవో టాస్క్‌లు అంటూ నిర్వహిస్తూ యువకులను మభ్యపెట్టి వాళ్ళ నుంచి డబ్బులు సేకరిస్తున్నారని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బహుళ జాతీయ కంపెనీల నమ్మకాన్ని సొంతం చేసుకున్న మా కంపెనీ ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి వ్యవహారాలని చూడలేదు. మా సంస్థ కేవలం ఎమ్ఎన్సీ కంపెనీలకు సేవలు అందిస్తుంది అంతే తప్ప సోషియల్ మీడియాలలో వ్యక్తిగతంగా సంప్రదించదు. ఈ విషయాన్ని అందరి దృష్టికీ తీసుకురావాలని మీడియా ద్వారా తెలుపుతున్నాము అని విపణి గ్రూప్ సీఈఓ సుధాకర్ కోలవెన్ను తెలిపారు. వ్యక్తిగతంగా సైబర్ నేరగాళ్ళతో మోసపోయిన కొందరు వ్యక్తులు తెలిపిన వివరాల ఆధారంగా మేము సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో కేస్ వేయడం జరిగింది. న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యాము. ఇందుకు కారణమైన వారికి శిక్ష పడేవరకూ పోరడతాం. తదుపరి.. మా కంపెనీ ద్వారా ఇలాంటి ఫేక్ ఆఫర్లు వినిపిస్తే వాటికి స్పందించకండి అని మీడియా ద్వారా విన్నవిస్తున్నామని విపణి గ్రూప్ ప్రతినిధి రఘు పూలపల్లి తెలిపారు.
ప్రశాంత్ కళ్యాణి, ఆపరేషన్స్ మేనేజర్
జ్యోత్స్నా ఉద్దండపు, సీనియర్ మేనేజర్