ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 17 : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి పెరిగిన జీతం ఏరియర్స్ వెంటనే చెల్లించాలి మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా,అనంతరం కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సెంటర్ అఫ్ ట్రెడ్ యూనియన్స్ (సీఐటీయు) మండల కన్వినింగ్ కమిటీ సమావేశం కన్వినర్ శోభ అధ్యక్షతన శుక్రవారం స్థానిక విశ్రాంతి భవనం నందు జరిగింది.మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనంతరం ఐబీ నుండి మండల విద్యశాఖ అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరై మాట్లాడుతూ… దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం,రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరాల నుంచి నేటి వరకు కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.కనీస వేతనాలు పెంపు లేదు,ఉద్యోగ భద్రత లేదు, కార్మిక హక్కులను కాలరస్తుంది. ప్రభుత్వం పెంచిన జీతం జివో విడుదల చెసి నెలలు గడుస్తున్న. పెంచిన వేతనం ఇంకా చెల్లించలేదు. ప్రభుత్వ పాఠశాలలో పని చేసే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయి,ఉద్యోగ భద్రత, పీఫ్,ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి,పెరిగిన జీతం పెండింగ్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి, తపాలా శాఖ పెట్టిన రూ,,399/- ప్రీమియాన్ని జిల్లా డిఈఓ చొరవ తీసుకొని కార్మికులకు ప్రీమియం కట్టి ఇవ్వాలని,యూనిఫామ్,ఐడి కార్డులు,దాంతో పాటు కోడి గుడ్డును,గ్యాస్ ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలి.ఈ కార్యక్రమంలో మండల కన్వినింగ్ నాయకులు కాంతమ్మ,రబియా, సునీత,లక్ష్మి,లత,దేవమ్మ,మల్లమ్మ, ఎల్లక్క,సాగర్ తదితరులు పాల్గొన్నారు.