శాసనసభ వెలుపల పాలకొల్లు శాసనసబ్యుడు నిమ్మల రామానాయుడు నిరసన
అమరావతి మార్చ్ 17 :రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మినహా మిగిలిన 20 జిల్లాల్లో తూర్పు కాపులకు కేంద్ర ప్రభుత్వ ఓబిసి రిజర్వేషన్ అందడం లేదని శాసనసభ వెలుపల పాలకొల్లు శాసనసబ్యుడు నిమ్మల రామానాయుడు ప్లే కార్డుతో గంటసేపు నిలువు కాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేసారు. తూర్పు కాపులకు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర బీసీ రిజర్వేషన్ ఇస్తుండగా కేంద్ర బీసీ రిజర్వేషన్ మాత్రం ఒక్క ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితం చేయడం వలన రాష్ట్రంలో మిగిలిన 20 జిల్లాలలో కేంద్ర ఓబీసీ రిజర్వేషన్ లేక తూర్పుకాపులు రైల్వే, తపాలా వంటి కేంద్ర ఉద్యోగాలకు, ఐఐటి, నీట్ వంటి కేంద్ర విద్యాసంస్థలకు దూరం అయ్యి నష్టపోతున్నారన్నారు. 2018లో ఈ సమస్య నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా కేంద్ర వెనుకబడిన శాఖ మంత్రి మరియు జాతీయ వెనుకబడిన వర్గాల కమిషనర్ దృష్టిలో తీసుకెళ్లి పరిష్కారం చేసే ప్రయత్నం చేయడం జరిగిందని నిమ్మల రామానాయుడు తెలిపారు.. 2019లో ప్రభుత్వం మారడంతో ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్న తూర్పు కాపుల సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం కనబరచడంతో తూర్పు కాపుల యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నానన్నారు. 31 మంది ఎంపీలు జగన్ కి ఇస్తే తూర్పు కాపుల సమస్యను పరిష్కరించకపోవడం అన్యాయం కేసులు, హత్యలు నుండి బయటపడడానికి 31 మంది ఎంపీల బలం ఉపయోగించుకుంటున్నారు గాని ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదు. తెలుగుదేశం పార్టీ తూర్పు కాపుల న్యాయమైన డిమాండ్ నెరవేర్చడానికి పోరాటం చేస్తున్నానన్నారు.