సీఎం కేసీఆర్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పువ్వాడ

 

ఈనెల 18న లాంఛనంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం

ఐదు లక్ష మందితో బీఆర్‌ ఎస్‌  జాతీయ తోలి సభకు వేదిక కానున్న ఖమ్మం

ఖమ్మంఈ నెల 18 న జరగనున్న సీఎం కేసీఆర్‌ పర్యట ఏర్పాట్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఅర్‌ గారి పర్యటన నేపద్యంలో ఆయా ఏర్పాట్ల పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పరిశీలించారు.

నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌ ను ముఖ్యమంత్రి కేసీఅర్‌  లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెరాస నంచి బీఆర్‌ ఎస్‌  గా ఆవిర్భవించిన అనంతరం జాతీయ తోలి సభ 5లక్షల మంది ప్రజలతో 100ఎకరాల స్థలంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని మంత్రి పువ్వాడ తెలిపారు. సభకు ముఖ్య అతిథులుగా కేసీఅర్‌ తో పాటు కేరళ, ఢల్లీి, పంజాబ్‌ ముఖ్యమంత్రులు పినరయ్‌ విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మన్‌, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ లు హాజరుకానున్నారని తెలిపారు. వివి పాలెం లోని కలెక్టరేట్‌ వెనుక నిర్వహించనున్న సీఎం సభ నిర్వహణ కోసం నిర్దేశించిన స్థలం ను కుడా  మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి విూడియాతో మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్‌ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పనుల ఫలితాలు ప్రజల వద్దకు అందుతున్నాయని పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సవిూకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు పూర్తవుతున్నాయని, వాటిని సీఎం కేసీఆర్‌  స్వయంగా ప్రారంభిస్తున్నారని మంత్రి తెలిపారు.  ఖమ్మం జిల్లా సవిూకృత కలెక్టరేట్‌ నిర్మాణ భవనాన్ని 18న స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌ పర్యటన, భారీ బహిరంగ సభ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.  సభ వద్ద వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల కోసం అవసరమైన మేర పార్కింగ్‌ ఏర్పాటు, ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో భద్రత పకడ్బందీగా ఉండే విధంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

సవిూకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించేందుకు జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్‌ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  సీఎం కేసీఆర్‌ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ ను ఆదేశించారు.

సీఎం కేసీఆర్‌  భారీ బహిరంగ సభ నేపథ్యంలో సభాస్థలి వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా ఏర్పాటు చేయాలని, నూతన సవిూకృత కలెక్టరేట్‌ భవనం పూర్తిగా శుభ్రం చేయాలని, సీఎం పర్యటన సమయానికి కలెక్టరేట్‌ భవనాన్ని పూర్తి హంగులతో అలంకరించాలని జిల్లా కలెక్టర్‌ కు సూచించారు.

సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో జిల్లాలో అత్యవసర సెలవులు మినహాయించి మిగిలిన సెలవులు రద్దు చేస్తున్నామని, జిల్లా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని , సీఎం కేసీఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలని సంభందిత అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking