మెదక్ మనోహరాబాధ్ ప్రజా బలం న్యూస్ :- మెదక్ జిల్లా లింగారెడ్డి పేట్ 110 ఎకరాల త్రిపుర వెంచర్లొ ప్రభుత్వ భూమి , దేవాలయ భూములు, గ్రామ నక్షదారులు కబ్జా చేసిందని లింగారెడ్డి పేట్ గ్రామస్తుల ఆందోళన..ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఎంపీ దృష్టికి తీసుకెళ్దాం అంటున్న ప్రజలు మనోహరాబాద్ ఎమ్మార్వో, డిప్యూటీ తాసిల్దార్ ప్రభుత్వ భూములను పరిరక్షించాలని గ్రామస్తుల ఆందోళన… త్రిపుర వెంచర్ వారు మరియు గ్రామస్తులు ఒకటే సారి సర్వే పెట్టడం తో గ్రామస్తులు మా ఊరి సర్వే చేసినా తరవాత మరుసటి రోజూ మీరు చేసుకోవాలి గ్రామస్తుల డిమాండ్. మా ఊరి సర్వే గవర్నమెంట్ సర్వే యారను పంపాలని వారి సర్వే ఆపాలని గ్రామస్తులు (mro) మనోహరాబాద్ తాసిల్దార్ ఆఫీస్ లో ఎమ్మార్వో తో తో మాట్లాడటం జరిగింది.ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండల పరిధిలోని లింగారెడ్డిపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని గ్రామస్తులు ఆందోళన…డిప్యూటీ తాసిల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన లింగారెడ్డి పల్లి గ్రామస్తులు, డబ్బులు ఇస్తే కానీ పహనిలు ఎవ్వడం లేదని, గ్రామస్తుల ఆందోళన.. సుమారు ఆరు నెలల నుండి తిరుగుతున్నప్పటికీ పట్టించుకోని అధికారులు అని మీడియా తో తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న త్రిపుర వెంచర్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూమిని గ్రామానికి ఉపయోగపడేలా చూడాలని మీడియాతో తెలిపారు.