హైదరాబాద్ ఫిబ్రవరి 25 ();ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి గుర్తుంపు నివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు నేడు రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్యశాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు ను సంఘం రాష్ట్ర అద్యక్షులు జి.దామోదర్ రెడ్డి, సెక్రటరి జనరల్ సి.చంద్ర శేకర్ ప్రతినిదుల బృందం కలిసి వినతి పత్రం సమర్పించారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం,1984 సం.లో స్థాపించబడినది. బడీ చౌడీ ఆర్యసమాజ్ భవనము ఎదురుగా స్వంతభవనము నిర్మించుకొని, పెన్స నర్లకు సేవ చేస్తున్నది.2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి, ఇట్టి సంఘం ఆంధ్ర ప్రదేశ్ మరియి తెలంగాణ రాష్ట్రలు గా విడిపోయి పనిచేయుచున్నవి. ప్రస్తు తం ఇట్టి సంఘం 33 జిల్లాశాఖలతో 240 మండల శాఖలతో దాదాపు రెండు లక్షల సభ్యత్వము పనిచేయుచున్నది. సుమారు 100 స్వంత భవనాలు కలిగి వున్నది. తెలంగాణ రాష్ట…అట్టి ప్రకటన ను మా సంఘము హర్శిస్తూ ధన్యవాదములు తెలియజేస్తున్నది.అట్టిట్రస్టులో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్స నర్ల సంఘాలను సభ్యులుగాఏర్పాటు చేస్తామని ప్రకటించినారు.కావున అట్టి ట్రస్టు ఏర్పాటులో “మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం” ప్రతినిధులను సభ్యులుగా చేర్చ్చాలని కోరినట్లు కార్యదర్శి తిరువరంగం ప్రబాకర్ తెలిపారు