రాజ్యసభ సబ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్ ఏప్రిల్ 2 :ఆర్ధిక సంవత్సరం మార్చి 31న ముగిసింది కానీ రాష్ట్రంలో 700 బీసీ హస్టళ్ళలలో నివసించే 70 వేలమంది మెస్ చార్జీల బిల్లులు 10 నెలలుగా పెండింగ్ లో యున్నవి పాస్ కాలేదు. మార్చి 31తో ఆర్ధిక సంవత్సరం ముగిసింది. కానీ బిల్లులు పాస్ కాలేదు. ప్రభుత్వం ఆర్ధికంగా దివాళా తీసిందాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సబ్యులు ఆర్.కృష్ణయ్య ప్రశ్నిచారు. అద్దె భవనాల బిల్లులు, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. దీని మూలంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టుర్లు అప్పుల పాలయ్యారు. నిత్యావసర వస్తువులు సరఫరా బందు చేస్తామని అంటున్నారు. దీనిమూలంగా హాస్టల్లో మూసివేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.అలాగే దాదాపు రాష్ట్రంలోని మొత్తం బీసీ కాలేజీ హాస్టళ్ళు అద్దభవనాల్లో యున్నవి. 9నెలలుగా అద్దె చెల్లించడం లేదు. వీపరీత జాప్యం మూలంగా అద్దె యజమానులు భవనాలు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. కావున వెంటనే అద్దె భవనాల బిల్లులు పాస్ చేయాలని డిమాండ్ చేసారు. హాస్టళ్ళ కరెంట్ బిల్లులు గత 10నెలలుగా పెండింగ్ లో యున్నవి. పరీక్ష సమయంలో హాస్టళ్ళుకు కరెంటు కట్ చేస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారు. పరీక్షలు ఎలా రాస్తారు. దీని ప్రభావం విద్యార్థుల పరీక్ష ఫలితాలపై యుంటుందని అన్నారు. పెరిగిన ధరల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బిసి కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.1500 నుంచి 3 వేలకు పెంచాలి. అలాగే పాఠశాల హాస్టళ్లకు – గురుకుల పాఠశాల విద్యార్థుల ఆహారపు చార్జీలు 8 నుంచి 10వ తరగతి వారికి రూ.1100/- నుంచి రూ.2500/- కు, 3వ తరగతి నుంచి 7 తరగతి వారికి రూ.950 రూపాయల నుంచి రూ.2000 కు పెంచాలని డిమాండ్ చేసారు. డే-స్కాలర్ షిప్ లను ఇంటర్ – డిగ్రీ కోర్సులు చదవే విద్యార్థులకు ఒకటే శ్లాబ్ గా 10 వేల కు పెంచాలని డిమాండ్ చేసారు.ఈ సమావేశం లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ,బిసి సంఘం రాష్ట్ర అద్యక్షులు సి.రాజేందర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పి.సుదాకర్ ముదిరాజ్, బిసి ఐక్యవేదిక రాష్ట్ర అద్యక్షులు అనంతయ్య,విద్యార్ధి సంఘం వరింగ్ ప్రసిడెంట్ పి.సతీష్ ,నికిల్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post
నిర్మల్ జిల్లాలోని ముజ్గి గ్రామపంచాయతీ కి ఆరోగ్య పంచాయతీ విభాగంలో రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతి
Next Post