ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ముజిగి గ్రామంలోని గ్రామపంచాయతీ నిరంతరం గ్రామ ప్రజల ఆరోగ్యం కొరకు శ్రమిస్తూ ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు నిరంతర పర్యవేక్షణ చేయడం అంతేకాకుండా గ్రామంలోని గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిరంతరం ప్రజలకు సేవలను అందించడం సమర్థవంతమైన నిర్వహణ వలన ప్రజలందరూ ఆరోగ్య సమస్యలు లేకుండా గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవడం వలన నిర్మల్ జిల్లాలోని ముజ్గి గ్రామపంచాయతీ కి ఆరోగ్య పంచాయతీ విభాగంలో రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతి పొంది జాతీయస్థాయికి ఉత్తమ ఆరోగ్య పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సిఫారసు చేయడం జరిగిందని రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఆరోగ్య గ్రామపంచాయతీగా అవార్డు సాధించినందుకు తేదీ 31-03-2023 రోజున గౌరవ మంత్రివర్యులు కే తారక రామారావు ఎర్రబెల్లి దయాకర్ రావు మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం జ్ఞాపిక సన్మానాన్ని సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి పొందడం జరిగింది ఇట్టి ఘనతను సాధించినందుకు గ్రామపంచాయతీ సర్పంచ్ కార్యవర్గం కార్యదర్శిని జిల్లా పాలనాధికారి శనివారం అభినందనలు తెలిపారు.