10వ తరగతి,ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా, సజావుగా నిర్వహించాలి

 

పదవ తరగతి పరీక్షలు మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు

ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 19 వరకు ఇంటర్ పరీక్షలు

మాస్ కాపీయింగ్ కు అవకాశం ఇవ్వోద్దు

….జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

సంగారెడ్డి పిబ్రవరి 22 ప్రజ బలం ప్రతినిది:
10వ తరగతి , ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా, సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. గురువారం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలను ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని ఆమె సూచించారు. పదవ తరగతి పరీక్షలు మార్చి 18 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉదయం 9-30 నుండి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
పదవ తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లాలో 121 పరీక్ష కేంద్రాల్లో 22045 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇందులో 11134 బాలురు కాగా 10911 మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 19 వరకు ఇంటర్ పరీక్షలు

ఒక నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రం లోకి అనుమతి లేదు,
ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 19వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు 52 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు , ఇంటర్ పరీక్షలో 36153 మంది పరీక్షలకు హాజరు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో 17665 విద్యార్థులు ఉండగా ఇందులో జనరల్ 15984 వృత్తి విద్యలో 1681 మంది పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇంటర్ రెండవ సంవత్సరంలో 18488 మంది విద్యార్థులుండగా17057 మంది జనరల్ కాగా 1431 మంది వృత్తి విద్య కోర్సు కు సంబంధించిన విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆమె వివరించారు.
ప్రశ్నాపత్రాలను భద్రపరిచేందుకు 17 పోలీస్ స్టేషన్ల గుర్తించడం జరిగిందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదని ఆమె తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని ఆమె తెలిపారు.
పరీక్ష కేంద్రం వద్ద అత్యవసర మందులతో పాటు ఏఎన్ఎం, సిబ్బంది నియమించాలని వైద్యాధికారికి సూచించారు.
అదేవిధంగా ఫర్నిచర్ , త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్లు, ఫ్యాన్లు ఉండే విధంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు.
పరీక్ష సమయాలను దృష్టిలో పెట్టుకొని ఆర్ టి సి బస్సులను నడిపించాలని తెలిపారు. ఒక నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రం లోకి అనుమతి లేదన్నారు. ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసేందుకు వీలుగా ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అన్నారు.
పరీక్షలను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మాస్ కాపీయింగ్ కు అవకాశం ఇవ్వోద్దు
జిల్లాలో మాస్ కాపీయింగ్ కు అవకాశం ఇవ్వకూడదని కలెక్టర్ తెలిపారు. కాపీయింగ్ జరిగినట్లు సమాచారం అందితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు తప్పులు చేసి ఇబ్బందులు పడకుండా పరీక్షలు పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు.
పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం కంటే నాణ్యమైన ఫలితాలే అవసరమని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు.
ఈ సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవరావు, డిఈఓ వెంకటేశ్వర్లు, డిఎంహెచ్వో గాయత్రి ,ఆర్డీవోలు రవీందర్ రెడ్డి ,రాజు ,పాండు, విద్యుత్ శాఖ టెక్నికల్ ఇంజనీర్ శ్రీనివాస్ ,ఎం వి ఇన్స్పెక్టర్ లావణ్య,ఆర్టీసీ అధికారులు, పోస్టల్ సిబ్బంది , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking