దళిత క్రిస్టియన్, ముస్లిం ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ గా కాశపక ఇమ్మయ్య.

 

సంగారెడ్డి పిబ్రవరి 22 ప్రజ బలం ప్రతినిది: సంగారెడ్డి లోని బైపాస్ రోడ్ లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశం ను జిల్లా లోని క్రైస్తవ సంఘాల పస్టర్లు పాల్గొని, క్రిస్టియన్ల పైన దాడులు జరుగుతున్న సందర్భంగా వాటిని అరికట్టడానికి జిల్లాలో నూతనంగా “దళిత క్రిస్టియన్ ముస్లిం ఐక్య వేదిక” ను ఏర్పాటు చేయటం జరిగింది. దానికి కన్వీనర్ గా కాశపాక ఇమ్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు, తెలియచేస్తు, ఇ కమిటిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వ్యాప్తి చేస్తు, రాష్ట్రo లో ఎక్కడ ముస్లింలపై కాని క్రైస్తవుల పైనా గానీ, చర్చి , మజీద్ ల పైన కాని, ఏ రకమైన అల్లరి మూకలు దాడులు చేసినా, వెంటనే స్పందిస్తూ రాజ్యాంగం ప్రకారం చట్టాలను గౌరవిస్తూ నిందితులకు శిక్ష పడేలా చూస్త, దళిత క్రిస్టియన్ ముస్లిం లను కాపాడుకునే బాధ్యతను తీసుకొని ముందుకు వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు గా అన్వర్, పాస్టర్ సత్యపాల్, పాస్టర్ విజయ్ కుమార్, కుమార్, ఆయా సంఘాల చర్చిల పాస్టర్లు, మైనార్టీస్, మరియు దళిత సంఘాల నాయకులు బంగారు కృష్ణ, అనంతయ్య, పి డి ఎస్ వి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking