ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి పై ఎంపీ నామ ఆరా

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 22 (ప్రజాబలం) ఖమ్మం మధిర టీడిపి మహిళా నాయకురాలు మన్నేపల్లి రత్నకుమారి భర్త, రిటైర్డ్ ఏఎస్ఐ ప్రసాద్ గత నాలుగు రోజుల క్రితం ఖమ్మం వైరా ప్రధాన రహదారి లో కొణిజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడి ఖమ్మం లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు కాగా గురువారం బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు రత్నకుమారి కి ఫోన్ చేసి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అలానే వారి కుమారుడు శరత్ తో కూడా మాట్లాడి ధైర్యంగా ఉండాలని వారి కుటుంబానికి భరోసా కల్పించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking