తెలంగాణ మైనార్టీ గ్రామీణ వైద్యుల 10 వ మహాసభ

 

హాజరు కానున్న ముగ్గురు మంత్రులు

సభ లో 2024 క్యాలెండర్ ఆవిష్కరణ

జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ హసన్, షేక్ జానీ మియా

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 1 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ మైనార్టీ గ్రామీణ వైద్యుల మహాసభ ఫిబ్రవరి 5వ తేదీన ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాలులో జరగనుందని , ఈ సభను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్. హసన్ , జిల్లా కార్యదర్శి షేక్ . జానీ మియా పిలుపునిచ్చారు. గురు వారం సంఘం కార్యాలయంలో సంఘం పదవ మహాసభ పై నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సభకు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఆర్ ఎం పి – పి ఎం పి రాష్ట్ర నాయకులుఎస్.కె .యాకూబ్ పాషా వరంగల్ ఎస్కే మన్సూర్ అలీ నల్గొండ , టీఎస్ సీపీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ హుస్సేన్ , ఖమ్మం నగరంలోని ప్రముఖ డాక్టర్లు హాజరుకానున్నార ని పేర్కొన్నారు. ఫిబ్రవరి 5 తేదీన జరగనున్న పదవ మహాసభ సందర్భంగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఉంటుందని తెలిపారు. సమావేశం సందర్భంగా గత సంవత్సరం ప్రగతి నివేదిక , భవిష్య కార్యాచరణ అంశాలపై చర్చించడంతోపాటు తీర్మానాలు చేస్తామన్నారు. తెలంగాణ మైనార్టీ గ్రామీణ వైద్యుల సంక్షేమం ప్రధాన ధ్యేయంగా మనం సంఘటితంగా సమస్యల సాధన పై ఉద్యమిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ హసన్ , వ్యవస్థాపకులు ఎస్కె. నజీరుద్దిన్ ,జిల్లా నాయకులు తూటికుంట్ల ఖాసీం,ఇమామ్, ఇషాక్, సోందుమియా ఆశ ,చాంద్ పాషా, హుస్సేన్ మియా ,నజీర్, మదార్ సాహెబ్ , షరీఫ్, మన్సూర్ అలీ, నబీ,పాషా, అహ్మద్, సైదా, మహమ్మద్ , నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking