ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ సెప్టెంబర్ 26 : పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 129 వ, జయంతి సందర్భంగా దండేపల్లి మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి,కేక్ కట్ చేసి ఘనంగా జయంతి వేడుకలను ఘనంగా గురువారం నిర్వహించడం జరిగింది.అనంతరం కోఠి మహిళా విశ్వవిద్యాలయం కు వీరనారి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కట్కూరి రాజన్న,మండల అధ్యక్షుడు పుట్టపాక తిరుపతి ఈ కార్యక్రమంలో నాయకులు వెంగళరావు, సిరికొండ నవీన్,కొల్లూరి రవి రజక సంఘం నాయకులు మందపెల్లి వెంకటేష్,కట్కూరి గౌరయ్య,గుండారపు రఘు,తాడూరి రమేష్,మారాజు సత్తీష్,మడిపెల్లి గణేష్,రాజు,కొత్తకొండ తిరుపతి,పుట్టపాక సాయి ప్రశాంత్,గుండారపు రాజు,నల్లూరి నరేష్,గుడికందుల రాజు,కిషన్,భూమేష్, రాజశేఖర్,శశికుమార్, చందనగిరి,నరేష్,లక్ష్మన్,చిన్న భూమేష్,నల్లూరి సతీష్,రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.