వరంగల్ ఎంజీఎం లో 2 కరోనా పాజిటివ్ కేసులు.

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 22 :

వరంగల్ జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్ద ఔట్ పేషెంట్లుగా వచ్చిన వారి వద్ద నుండి గురువారం నమూనాలు సేకరించి కాకతీయ మెడికల్ కళాశాలలోని వైరాలజీ విభాగానికి 6 గురి రోగుల నమూనాల ఆర్టీపిసిఆర్ ఫలితాలు శుక్రవారం అందయి అందులో ఇద్దరికీ పాజిటివ్ గ నిర్ధారణ అయింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన యాదమ్మ,రాజేందర్ లకు పాజిటివ్ గ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో యాదమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎంజీఎం సూపర్డెంట్ వి చంద్రశేఖర్ బుల్ టెన్ ద్వారా వెల్లడించారు. అవుట్ పేషెంట్ గా వచ్చిన రోగికి తగు జాగ్రత్తలు చెప్పి ఔషధాలు ఇచ్చి పంపించడం జరిగిందని ప్రజలు కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking