ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 22 (ప్రజాబలం) ఖమ్మం లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశం నిర్వహించి, ఖమ్మం నగరపాలక సంస్థ, వైరా, మధిర, సత్తుపల్లి మునిసిపాలిటీలు, సుడా పరిధిలో లే-అవుట్ల ఆమోదం కొరకై అందిన (23) దరఖాస్తులను పరిశీలించారు. నిబంధనల మేరకు సమర్పించబడిన దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో లే-అవుట్ల ఆమోదం కొరకు రెవెన్యూ, విద్యుత్, ఇర్రిగేషన్, రోడ్లు భవనాల, టౌన్ ప్లానింగ్ తదితర అనుబంధ శాఖల నుండి అనుమతులకై సమర్పించిన దరఖాస్తులను ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, స్థల పరిశీలన చేసిన మీదట 21 రోజుల లోపు అనుమతులను జారీచేయాలని, తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని అన్నారు. గ్రీనరీ కొరకు కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనపర్చుకొని మొక్కలు నాటాలన్నారు. లేఅవుట్ డెవలపర్స్ కూడా నిబంధనల మేరకు చట్టబద్దంగా సమగ్ర ప్రణాళికబద్దంగా ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, జెడ్పి సిఇఓ అప్పారావు, డిపిఓ హరికిషన్, పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, డిటిసిపిఓ ప్రసాద్, టిపిఓ వికాస్, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపల్ కమీషనర్లు సుజాత, రమాదేవి, కరుణాకర్ రెడ్డి, తహశీల్దార్లు, ఇర్రిగేషన్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
