కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 ఎదుర్కొనేందుకు ఎంజీఎంలో అన్ని సిద్ధం : ఎంజీఎం సూపర్డెంట్ డాక్టర్ చంద్రశేఖర్,
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 22:
కరోనా కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, ఔషధాలు వెంటిలేటర్లు సర్వం సిద్ధంగా ఉన్నాయని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వి చంద్రశేఖర్ అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్న రీత్యా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసిన నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా కొత్త వేరియంట్ ను ఎదుర్కోవడం పై శుక్రవారం ఎంజీఎంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మొదటి ,రెండవ వెవ్ లను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఎదుర్కొని ప్రాణాలకు తెగించి వైద్యులు, సిబ్బంది ప్రజల ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న కొత్త వేరియంట్ జేఎన్-1 ను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని 1200 పైచిలుకు కరోనా రోగులు ఆసుపత్రికి వచ్చిన వైద్యం అందించే సదుపాయాలు ఉన్నాయని సరిపడంత ఆక్సిజన్ ఉందని, ఔషధాలు సరిపడినన్ని ఉన్నాయని అన్నారు. ప్రజలు కోవిడ్ పై జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ప్రజలు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఆయనతో పాటు ఆర్ ఎమ్ ఓ డాక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.