యువత అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలి జిల్లా అధికారి సునీల్ రెడ్డి

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 22 (ప్రజాబలం) ఖమ్మం యువత అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారి సునీల్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో జిల్లా క్రీడల, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారి, జిల్లా పౌరసంబంధాల అధికారి ఏం.ఏ. గౌస్ తో కలిసి, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు చెందిన యువ కళాకారులకు సామూహిక ప్రదర్శనలు జానపద నృత్యం (సమూహం), జానపద నృత్యం (సోలో), జానపద గేయాలు (సమూహం), జానపద గేయాలు (సోలో), వ్యక్తిగత ప్రదర్శనలు వ్యాస రచన, పోస్టర్ తయారీ, వ్రకృత్వ పోటీ, ఫొటోగ్రఫీ లలో పోటీలు నిర్వహించడం జరిగిందని, విజేతగా నిలిచి ప్రథమ స్థానం పొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. యువజనులు కళారంగంలో రాణించి ప్రజలను చైతన్యపరుస్తూ జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో ఉంచేందుకు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న అనేక కార్యక్రమాలు, పథకాలను గ్రామీణ స్థాయి నుండి అర్హత గల వారు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని, ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని సాధించేలా తోటి యువజనులను ప్రోత్సహించాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకువచ్చేలా కళారంగంలో రాణించాలని అన్నారు ఈ కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షులు ఉమాశంకర్, మాజీ అధ్యక్షులు వెంకటరమణ, డిఆర్ఎస్ అకాడెమీ చైర్మన్ సతీష్, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు సుధీర్, అథ్లెటిక్, వాలీబాల్, టిటి కోచ్ లు గౌస్, అక్బర్, మూర్తి, అధికారులు, యువజన కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking