భద్రకాళి బండ్ ప్రాంతాన్ని రెసిడెన్సియల్ జోన్ గా ప్రకటించాలి..

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 22:
తెలంగాణ పర్యావరణ అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖని భద్రకాళి ట్యాంక్ బండ్ ఏరియా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మర్రి రవీందర్ జూబ్లీహిల్స్ నివాసం లో శనివారం కలిసి పూలబొకే అందజేసి అభినందనలు తెలిపారు.
అనంతరం 28 వ డివిజన్ లో ఉన్న బొంది వాగు నాలా సమస్య పై వివరించారు. వరదలు వచ్చినప్పుడు బొంది వాగు నాలా పొంగి 28 వ డివిజన్ లోని అనేక కాలనీలు మునిగి ప్రజలు నిరాశ్రయులు కావడమే గాక నిత్యావసర వస్తువులు పలు ఆస్తులు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు .ఈ సమస్య పై వాగు కరకట్ట నిర్మాణం కోసం ప్రభుత్వం రూపాయలు 158 కోట్లు మంజూరి చేసిందన్నారు .అనంతరం అట్టి పనులు ప్రారంభం కాకుండానే డబ్బులు తిరిగి ప్రభుత్వానికి వెళ్ళాయని అన్నారు. అట్టి డబ్బులను వేంటనే మంజూరి చేసి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బొందివాగు కరకట్ట పనులను చేపట్టాలని మంత్రికి వివరించారు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వంద ఫీట్ల వరకు కరకట్ట నిర్మించి మిగిలిన ప్రాంతాన్ని రెసిడెన్సియల్ జోన్ గా ప్రకటించాలని కోరారు.ఈ ఇట్టి విషయం పై స్పందించిన మంత్రి సురేఖ మాట్లాడుతూ తమ ప్రభుత్వం నాలా పనులు త్వరలో చేస్తుందని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న నగరపాలక సంస్థ కమీషనర్ షేక్ రిజ్వాన్ బాషా సైతం ఇట్టి విషయం పై సమీక్ష చేసి బొందివాగు నాలా పనులు ప్రారంభిస్తామని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్, కన్నోజు జలందర్, వలబోజు శ్రీనాద్, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking