వివేక్. కు మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేయాలి
అట్టడుగు వర్గాల అభివృద్ధి ప్రదాత వెంకటస్వామి
పెద్దపల్లి ప్రజాబలం డిసెంబర్ 23 అట్టడుగు వర్గాల అభ్యున్నతికి చివరి వరకు పోరాటం చేసిన నేతగా స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి చిరస్మరణీయుడని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ పేర్కొన్నారు శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్ బండి వద్ద వెంకటస్వామి 9వ వర్ధంతి వేడుకలలో పాల్గొని అంజలి ఘటించారు ఈ సందర్భంగా వెంకటస్వామి కున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం ద్వారానే స్వరాష్ట్రంలో బీదరికం తొలగిపోతుందని ఆయన కలలుగన్నాడని పేర్కొన్నారు అందుకోసమే తెలంగాణ రాష్ట్రం కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేశాడని పేర్కొన్నారు వెంకటస్వామి ఇచ్చిన నైతిక ధైర్యంతోనే స్వరాష్ట్ర సాధనకై కెసిఆర్ ముందుకు కదలాడని పేర్కొన్నారు వెంకటస్వామి కుటుంబంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రి పదవి ఇచ్చి.. న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శ్రీమన్నారాయణ కోరారు