జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ములుగు.
ప్రజా బలం ములుగు జిల్లా రిపోర్టర్ నవంబర్ 19 ములుగు మండలంలోని రాయని గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు ఆదేశానుసారం, జంగాలపల్లి గ్రామం నందు 2 రోజు ఆరోగ్య శిబిరము మరియు వ్యాధులపై అవగాహన ను రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఆరోగ్యం సిబ్బందిని 10 టీములుగా విభజించి గ్రామంలో ప్రతి ఇంటింటి సందర్శన గావించి, బూత పిచాచాల వంటి ప్రచారాలను నమ్మద్దని ఆరోగ్య సమస్య ఏర్పడిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్సను తీసుకోవాలని భూత పసరు వైద్యాల జోలికి పోవద్దని ప్రజలకు ఇంటింటి సందర్శనలో అవగాహనను పెంపొందించి భయందొలలను తొలగిస్తూ అవగాహన కల్పించారు ఇంటిలో జ్వరము మరియు ఏ ఇతరవ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే వైద్య శిబిరాలకు పంపించి చికిత్సను అందించారు. బీపీ షుగర్ పరీక్షలకు వైద్య శిబిరాలకు పంపిస్తూ, నీటి నిల్వలను గుర్తిస్తూ, గ్రామ పెద్దలతో మాట్లాడుతూ అవగాహనను ప్రజలలో పెంపొందించారు. ఈరోజు వైద్య బృందాలు 540 ఇండ్లను సందర్శించారు. వైద్య శిబిరానికి 212 మందికి ఓపి సేవలు అందించారు. 45 మందికి రక్త నమోనాలను సేకరించారు. 145 మందికి బిపి మరియు 50 మందికి మధుమేహం పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరాల ను మరియు అవగాహన సదస్సును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్. పవన్ కుమార్, డాక్టర్. శ్రీకాంత్, ఇంచార్జ్ మాస్ మీడియా అధికారి సంపత్, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి దుర్గారావు సందర్శించి, మెడికల్ క్యాంపును, ఇంటింటి సర్వేనుతనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో రాణి గూడెం వైద్యాధికారి డాక్టర్ వైశాలి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్లు నవ్యరాణి, డాక్టర్ నందకిషోర్ డాక్టర్ రవళి డాక్టర్, డాక్టర్. నవ్య, ఆరోగ్య విస్తరణ అధికారి సురేష్ బాబు, సూపర్వైజర్ దేవేందర్ , నిర్మల మేరి వసంత ఉమారాణి ,ఆరోగ్య కార్యకర్తలు, సుజాత, నికిత ఊర్మిళ ల్యాబ్ టెక్నీషియన్లు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.