ప్రజా పాలన విజయోత్సవం 2024 ప్రజా కళాయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్లు మరియు రెవెన్యూ అధికారి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 19:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు-2024 కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు మేడ్చెల్ మల్కాజిగరి జిల్లా
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో బాగంగా మేడ్చెల్ మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో “ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు-2024” “ప్రజా కళాయాత్ర” ను జిల్లారెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి లు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారులు నవంబర్ 19 నుండి డిసెంబర్ 7 వరకు ప్రతి రోజూ 3 గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై ప్రచారం గావించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాంమోహన్, డిఆర్డిఓ అధికారి సాంబశివరావు, జిల్లా ఎస్సీ అభవృద్ది శాఖాధికారి వినోద్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది, టిఎస్ఎస్ కళాకారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల పై కళాకారులు పాటలు పాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking