జ్ఞానాన్ని ప్రసాదించే దేవాలయాలే గ్రంథాలయాలు :: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు జిల్లా కేంద్రంలోని లైబ్రరీని త్వరలోనే మోడల్ లైబ్రరీగా తీర్చిదిద్దుతాం.
గ్రంథాలయంలో చదువుకొని ఉపాధ్యాయ కొలువులకు ఎంపికైన తొమ్మిది మందిని సన్మానించిన మంత్రి సీతక్క.
గ్రంధాలయంలో టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన
ముగిసిన 57వ జాతీయ గ్రంథాలయ ఉత్సవాలు
ప్రజా బలం ములుగు జిల్లా రిపోర్టర్ నవంబర్ 19 జ్ఞానాన్ని ప్రసాదించే దేవాలయాలే గ్రంథాలయాలని , ములుగు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని త్వరలోనే మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు.
మంగళవారం 57వ జాతీయ గ్రంథాలయ ఉత్సవాల ముగింపు సమావేశానికి మంత్రి అనసూయ సీతక్క , బానోత్ రవిచందర్ , జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి హాజరై గ్రంథాలయంలో చదువుకుని ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించి, నూతన టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ ఇందిరా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రంధాలయ ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని , బ్యాంకులను జాతీయ చేసిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందని వారు చేసిన సేవలను మంత్రి సీతక్క కొనియాడారు.
ప్రతి గ్రామంలో విద్యాలయం తో పాటు గ్రంథాలయం కూడా ఉండాలని బడి ద్వారా మన బతుకులు కుటుంబాల భవిష్యత్తు , దేశ భవిష్యత్తు కూడా బడిలోనే నిర్మితం అవుతుందని అదేవిధంగా గ్రంధాలయాల ద్వారా జ్ఞానం లభిస్తుందని తెలిపారు.
గ్రామాలలో ఉండే గ్రంథాలయాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా స్థానిక ప్రజలు జ్ఞానవంతులు అవుతారని వారితోపాటు యువతకు ఉపాధి ఉద్యోగాలలో రాణించడంలో గ్రంథాలయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
నూతన ప్రభుత్వం ఏర్పాటు కాగానే కేవలం 10 నెలల కాలంలో 54,000 మందికి ఉద్యోగాలు నియామక పత్రాలు అందించామని తెలిపారు.
ఈ గ్రంథాలలో చదివినటువంటి యువత కూడా తొమ్మిది మంది టీచర్ ఉద్యోగాలు సాధించడం సంతోషదాయకంగా ఉందని అన్నారు.
రాబోయే రోజుల్లో ఈ గ్రంథాలయం యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పుస్తకాలు గాని ఇక్కడ వాతావరణం మరిత అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
మోడల్ లైబ్రరీ గా రూపొందించడంలోనే భాగంగా ఈరోజు ఆ టాయిలెట్స్ నిర్మాణం అదేవిధంగా ఈ గ్రంథాలయ స్థలాన్ని కూడా సర్వే చేసుకొని కాంపౌండ్ వాల్ నిర్మించడం చుట్టూ చెట్లు కూడా నాటాలని అధికారులకు సూచించారు
అదే విధంగా ములుగు టౌన్ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని త్వరలోనే ప్రస్తుతం బస్ స్టేషన్ ఆవరణలోనే మోడల్ బస్టాండ్ నూతన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని గత వర్షాకాలం వల్ల పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలోని గ్రంధాలయాన్ని స్థానిక యువత నిరుద్యోగులు ఎంతగానో ఉపయోగించుకుంటున్నారని , గత కొద్దిరోజుల క్రితం గ్రంథాలయ పర్యవేక్షణకు వచ్చిన సమయంలో అనేకమంది యువత పోటీ పరీక్షలకు సిద్ధం అవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గ్రంధాలయానికి వచ్చే వారికి మధ్యాహ్నం భోజనం అందించడం చాలా సంతోషకరమైన విషయం అని పోటీ పరీక్షల్లో ఇక్కడ చదువుకున్న వారు ఉద్యోగాలు సాధించడం మరి ఎంతో మంది యువతకు స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రంథాలయాన్ని మోడల్ గ్రంథాలయంగా త్వరలోనే తీర్చిదిద్దడం జరుగుతుందని పాఠకులకు కావలసిన నూతన పుస్తకాలు ఉపాధి విద్య ఉద్యోగాలకు అవసరమయ్యే వనరులను కూడా అందించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా పంచాయతీ అధికారిదేవరాజ్, డి డబ్ల్యూ ఓ శిరీష తదితరులు పాల్గొన్నారు