ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం

 

 

తండాల అనుసంధానం కోసం లింక్ రోడ్లకు అధిక ప్రాధాన్యత

అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రోడ్లు పనులు పూర్తి చేయాలి
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క

**

ప్రజా బలం ములుగు జిల్లా రిపోర్టర్ నవంబర్ 19 : ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని, మారుమూల ప్రాంతాల లోని చిన్న చిన్న తండల అనుసంధానం కోసం లింకు రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

మంగళవారం ములుగు మండలంలో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న జాకరం నుండి ఇంచేర్వుపల్లి బీటీ రోడ్డు,80 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న వెంకటేశ్వర్ల పల్లె నుండి మాడా లక్ష్మారెడ్డిపల్లె బీటీ రోడ్డు,80 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఆర్ అండ్ బి రోడ్ నుంచి ఏసునగర్ బీటీ రోడ్డు,ఒక కోటి యిరవై లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న ఆర్ అండ్ బి రోడ్ నుంచి దేవనగర్ వయ యపలగడ్డ్ బీటీ రోడ్డు లను మంత్రి అనసూయ సీతక్క , జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్, లతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసే రోడ్లకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా 12 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం లింకు రోడ్లపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. నూతనంగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులనునాణ్యతతో పూర్తి చేయాలని, నాసిరకంగా పనులు చేసే కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటాలని, చెట్ల తోనే మానవ మనుగడ ముడిపడి ఉందని అన్నారు. మల్లంపల్లిలోని ఉమర్ ఖాన్ కు చెందిన భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తామని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనుఅమలు చేస్తున్నామని, రానున్న రోజులలో మిగిలిపోయిన హామీలనుఅమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నదని, రైతు పండించిన ప్రతి గింజలు కొనడమే కాకుండా రైతు భరోసా అమలు చేస్తామని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ యస్ ఇ అజయ్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

అంతకుముందు

జాతీయ రహదారి డివైడర్ మధ్యలో ఎవెన్యు ప్లాంటేషన్ మొక్కలను మంత్రి అనసూయ సీతక్క, ములుగు జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ బానోత్ రవి చంద్ర కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి నాటి నీరు పోశారు.

ఈ జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ , జిల్లా సంక్షేమ అధికారి శిరీష ములుగు ఎంపిడిఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking