20 కోట్లతో ఫోనిక్స్ ప్లాష్టో బేబీ హైజెనిక్ ప్రొడక్ట్ కంపెనీ

జాతీయ, అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ కంపెనీ

దేశంలోనే మొదటి బేబీ హైజేనిక్ ప్రొడక్ట్ కంపెనీ
డైరెక్టర్లు హర్షవర్ధన్ రెడ్డి, క్రుష్ణ,

మనోహరబాద్, సెప్టెంబర్, 9. ప్రజా బలం న్యూస్ :-

భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా 20 కోట్ల భారీ పెట్టుబడితో అతి పెద్ద బేబీ హైజెనిక్ ప్రొడక్ట్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మనోహరబాద్ లో ఏర్పాటుచేసినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ లు కృష్ణ సింఘకొలి, హర్షవర్ధన్ రెడ్డి లు తెలిపారు. శనివారం గణపతి పూజ తో ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ను విజయవంతంగా ప్రారంభించిన అనంతరం మీడియా తో మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని మనోహరబాద్ లో ప్రధాని మోడీ మెకిన్ ఇండియా పిలుపు కు స్ఫూర్తిగా బేబీ బడ్స్ పరికరాలను అత్యంత నాణ్యత తో రూపొందించిన కిడ్స్ కిట్ల ను దేశీయ అంతర్జాతీయ మార్కెట్లకు తరలించి దేశ ఔనత్యాన్ని వెలుగెత్తి చాటుతామని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు హోం నీడ్స్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని, ఎవ్వరూ కూడా బేబీ ప్రొడక్ట్స్ పై దృష్టి సారించలేదని అందుకే తాము విదేశాల ఉత్పత్తుల పై ఆధార పడి ఉండకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫోనెక్స్ కంపెనీ ఏర్పాటు చేసి మన్నికైన ఉత్పత్తులతో అద్భుతంగా ప్రయోజనకరంగా రూపొందించి మార్కెటింగ్ చేస్తామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking