కోటి 24 లక్షలతో సీనియర్ నాయకులు ఎలక్షన్ రెడ్డితో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించిన మున్సిపాలిటీ చైర్మన్ రవీందర్ గౌడ్

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపల్ అభివృద్ధి పథంలో భాగంగా 8వ వార్డు పోతారాజ్ పల్లిలో మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ , ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలక్షన్ రెడ్డి , గారితో కలిసి ఒక కోటి 24 లక్షలు ,(1.24) డ్రైనేజీ సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అభివృద్ధి పథంలో తూప్రాన్ మున్సిపాలిటీ నెంబర్వన్ గా అవుతుందని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మనం పుట్టడం అదృష్టమని , దేశంలోనే గజ్వేల్ నియోజకవర్గం మొదటి స్థానం అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో నిలబడుతుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారన్నారు, తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు అందరూ ఐక్యమత్యంతో అభివృద్ధిని సాధించుకోవాలని మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గడ నిధులనుండి మంత్రి హరీష్ రావు సహకారంతో ఈరోజు 8వ వార్డులో ఒక కోటి 24 లక్షలతో డ్రైనేజీ సిసి రోడ్డు పనులను ప్రారంభించామని, రాబోయే రోజుల్లో తూప్రాన్ మున్సిపాలిటీలో అన్ని వార్డులలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, తూప్రాన్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే ఆకుపచ్చ, ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని, మీ వార్డ్ లో ఏమన్నా సమస్యలు ఉంటే నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు అని, మున్సిపాలిటీ అభివృద్ధికి అందరు సహకరించాలని చైర్మన్ రవీందర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమం లో తూప్రాన్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ , కమిషనర్ మోహన్ ఏఇ సాయిరాం రెడ్డి, నాయకులు దుర్గా రెడ్డి,అమృత్, ఆంజనేయులు యాదవ్, వెంకటేష్ చారి, మున్సిపల్ సిబ్బంది ప్రవీణ్, ఇప్రాన్, 8వ వార్డు సభ్యులు గ్రామస్తులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking