ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలిపించాలని మెదక్ జిల్లా తపస్సు నాయకుల ప్రచారం

.

మెదక్ శివ్వంపేట్ న్యూస్ :-

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ ఉపాధ్యాయ తపస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శివంపేట మండలంలోని శివ్వంపేట్ గోమారం, చండి ,దొంతి ,శివంపేట ఉన్నత పాఠశాలల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జిడ్డి ఎల్లం మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల కోసం,ప్రభుత్వ పాఠశాలల బలవపేతం కోసం కృషి చేయడానికి తపస్ బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కోరడం జరిగింది.ప్రస్తుతం ఉన్న టీచర్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులకు రావలసిన పి ఆర్ సి, డిఎ బకాయిల గురించి ,సిపిఎస్ రద్దు గురించి, జీవో నెంబర్ 317 రద్దు చేసి స్థానికత ఆధారంగా ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు పంపాలని ఏ ఒక్క రోజు కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు అందక, 8 ఏళ్లుగా పదోన్నతులు లేక ,ఐదేళ్లుగా బదిలీలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రస్తుత ఎమ్మెల్సీలు ఏ ఒక్కరోజు మాట్లాడిన పాపన్న పోలేదు. కాబట్టి ఈనెల 13వ తారీకు జరిగే ఎన్నికల్లో తపస్ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ ,జిల్లా ఉపాధ్యక్షులు గోగులోతు రామచందర్, జిల్లా కార్యదర్శి రవిబాబు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking