ప్రజా బలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏఐఎంఐఎం పార్టీ కార్యాలయంలో గురువారం రోజున 65వ ఆవిర్భావ దినోత్సవం లాంఛనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు అజిం బిన్ యాహియ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి భారత రాజ్యాంగ నియమా నిబంధనలకు అనుగుణంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతూ ముందుకెళ్తున్నదని చెప్పారు. నిర్మల్ నియోజకవర్గంలో పట్టణంలో పార్టీ బలోపేతానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మునిసిపల్ వార్డులు గ్రామాల వారీగా వాటిని ప్రతిష్ట పరిచే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పదిమంది సంఘ సేవకులకు ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ మజహర్ కౌన్సిలర్లు మహమ్మద్ ముజాహిద్ అలీ, సయ్యద్ అబ్రార్ హుస్సేన్, నాయకులు మహమ్మద్ ఉస్మాన్, సయ్యద్ చాంద్ పాషా, మహమ్మద్ ఇంతియాజ్, మహమ్మద్ ఇర్ఫాన్, మొహమ్మద్ ఫెరోజ్ తయ్యబ్ బిన్ సలా,మహమ్మద్ అమన్ ఖాన్ ,అబ్దుల్ జబ్బార్ ,పాష తదితరులు ఉన్నారు.