హైదరాబాద్ మార్చ్ 2 (); కాకతీయ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి పై ర్యాగింగ్ చేసి మానసికంగా వేధించిన సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ ని ర్యాగింగ్ నిరోధక చట్టం క్రింద వెంటనే అరెస్టు చేసి . కఠినంగా శిక్షించాలని బిసి మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బిసి భవన్ లో బిసి మహిళా సంఘం ఆద్వర్యం లో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్. కృష్ణయ్య, బిసి మహిళా సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శులు కాకుమాను లూర్దు జ్యోతి, ఎన్. నిర్మల ముదిరాజ్, జగదాంబా లు హాజరై ప్రీతి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్య విద్యార్థిని ప్రీతి ని వేధించిన ఘటనలో నిందితుడు డాక్టర్ సైఫ్ కు రాజకీయ నేపథ్యం ఉందని ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం కొనసాగుతుందని గతంలో కూడా బంజారాహిల్స్ మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ అత్యాచార సంఘటనలో కూడా రాజకీయ నేపథ్యం ఉండటంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయని ప్రీతి కేసులో కూడా అదే ప్రయత్నం కొనసాగుతుందని ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలోఅనుమానాలకు తావివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపాల్ పై కూడా అనుమానాలు ఉన్నాయని అదే నిజమైతే ఆయనపై కూడా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. అలాగే మహిళల వేధింపులు, చెడు వ్యసనాలు బంగారు భవిత పై బాధ్యతలేని యువతరంలో మార్పుకై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యారంగం సినిమా రంగాలలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని దృష్టిలో పెట్టుకొని స్త్రీని గౌరవించే విషయంలో సమూల మార్పు తెచ్చే అవసరం ఎంతగానో ఉందని వారు పేర్కొన్నారు.