పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు త‌గ్గించండి… లేకుంటే గ‌ద్దె దిగండి

.

 

*నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ర్యాలీ, ధర్నా,
కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం*

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశంతో నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో గురువారం మ‌హిళ‌లు, బీఆర్ఎస్ శ్రేణులు ధ‌ర్నా నిర్వహించారు. అంత‌కు ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి మయూరి హోటల్ చౌరస్తా వరకు మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వ‌హించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేసి,పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను వెంటనే తగ్గించాలని ప్లకార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ… బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా నినాదాలు చేశారు. అనంత‌రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొమోరాండం స‌మ‌ర్పించారు.
ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేత‌లు మాట్లాతూ…. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్‌లకు కొమ్ముకాస్తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని, కార్పోరేట్‌ కంపెనీలపై ఉన్న ప్రేమ సామాన్య ప్రజలపై లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతీ రోజు ఏదో ఒక రూపంలో ధరలు పెంచుతూ పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటుంద‌ని అన్నారు.సిలిండర్‌ ధరలను అమాంతం పెంచి సామాన్య మహిళలకు గ్యాస్‌ సిలిండర్‌ను కేంద్ర ప్రభుత్వం దూరం చేస్తుందని, పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking