వారం రోజుల పాటు కార్యక్రమాలు
జిల్లా సంక్షేమ అధికారి M. క్రిష్ణ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా జనవరి 20:
భేటీ బచావో భేటీ పడావోపథకంలో భాగంగా జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి M. క్రిష్ణ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్బంగా శనివారం భేటీ బాచో భేటీ పదవో కార్యక్రమం లో భాగంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిషేక్ ఆగస్త్యా చేతుల మీదిగా పోస్టర్స్ విడుదల,మరియు BBBP ప్రతిజ్ఞ బ్యానర్ పైన సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమoలో డి ర్ ఓ, డిఇ ఓ , సి డి పి ఓస్ మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.