అందరం కలిసికట్టుగా పనిచేద్దాం… హుజురాబాద్ నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నడిపిద్దాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
హుజురాబాద్ ప్రజాబలం జనవరి 20
నియోజకవర్గం లోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు అందరు సహకరిస్తే కలిసికట్టుగా పనిచేసి హుజురాబాద్ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం హుజరాబాద్ లోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మొదటి రివ్యూ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని విభాగాల్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి అధికార ఒత్తిడిలకు లొంగకుండా అధికారులు, ఉద్యోగులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. ఒక్కో విభాగంతో ప్రతినెల రివ్యూ ఏర్పాటు చేసుకుందామని, అందులో సమస్యలను చర్చించుకుందాం అని అన్నారు. జనరల్ బాడీ సమావేశంలో కూడా సభ్యులు లేవనెత్తిన అంశాలను కూడా పిన్ చేయాలని అన్నారు. ప్రజల అన్ని సమస్యలను పరిష్కరించేలా అధికారులు ఉండాలని వారికి తన వంతు సహకారం తప్పక ఉంటుందని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మెదలాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డిఓ రాజు, ఎమ్మార్వో విజయ్ కుమార్ లతోపాటు రెవెన్యూ, మండల పరిషత్, అగ్రికల్చర్, విద్యుత్, హెల్త్, ఐసిడిఎస్, వెటర్నరీ,మున్సిపల్, దేవాలయ, ఆర్ అండ్ బి, ఆర్టీసీ పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, విద్య ఫారెస్ట్ ఎక్సైజ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.