శంభునిపల్లి ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నికలపై సమావేశం

●జనవరి 29న ఎన్నికలు

జమ్మికుంట, ప్రజాబలం జనవరి20

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ఈనెల 29న నిర్వహించనున్న నేపథ్యంలో జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో శనివారం ఉదయం ప్రధానోపాధ్యాయులు మచ్చ సునీత ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సునీత మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల విషయంలో, విద్యా బోధన ఇతర విషయాలలో విద్యార్థుల సౌకర్యం కోసం గతంలో మాదిరిగానే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జనవరి 29న నిర్వహించనున్నదని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీచేసే విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లను ఇవ్వాలని తెలిపారు. 29వ తేదిన ఎన్నికలలో స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నిక కొరకు తల్లిదండ్రులు తమకు నచ్చిన అభ్యర్థి కి చేతులెత్తి చైర్మన్ ని ఎంపిక చేసుకోవాలని అన్నారు.. కొత్తగా ఏర్పడిన కమిటీతో అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయిని పప్పుల శారద ఎస్ఎంసి చైర్పర్సన్ చేలుగాల సురేష్, రాజు, సురేష్,నరేష్, వెంకటరాజాం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking