తూప్రాన్ లో భారీ చోరీ

7లక్షలు చోరీ జరిగినట్లు పోలీసులకు బాధితుడి పిర్యాదు

మెదక్ తూప్రాన్ జనవరి 20 ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రం తూప్రాన్ పట్టణంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి మూసి ఉంచిన వ్యాపార సముదాయంలో దొంగలు పడి 7లక్షల పైచిలుకు రూపాయలు చోరి చేసినట్లు ఎస్ఐ శివనందం తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం మెదక్ తూప్రాన్ పట్టణానికి చెందిన మామిళ్ళ శ్రీకాంత్ స్థానిక హోండా షోరూమ్ ఎదురుగా సిమెంట్ స్టీల్ షాప్ నడుపుతూ ఉన్నాడు.శుక్రవారం సాయంత్రం షాప్ రోజు మాదిరిగానే మూసి వేసి ఇంటికి వెళ్లగా శనివారం ఉదయం షాప్ కి వెల్లి చూడగా షాప్ లొని సీలింగ్ ధ్వంసం అయి ఉండి, షాప్ గల 7లక్షల పది వేల రూపాయలు కనిపించకుండా పోవడం తో స్థానిక పోలీసులకు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించడం తో క్లూస్ టీం జాగిలాలతో తనిఖీలు నిర్వహించి ఆనవాళ్లు సేకరించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking