ప్రొఫెసర్ – ఫోర్జరీ విధుల నిర్వహణ.?

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 20:
ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ యం. రాములు వ్యవహరించిన తప్పుడు సంతకాలపై తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాక్ రాష్ట్ర అధ్యక్షులు వలిగొండ నరసింహ ఓయూ రిజిస్టర్ గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ యం. రాములు తమ విధులకు సకాలంలో పూర్తిగా హాజరుకాకుండానే తమ విధులకు హాజరైనట్లు తప్పుడు పద్ధతుల్లో రోజువారి హాజరు పట్టికలో బ్లాక్ చేసిన తేదీలలో విధులకు హాజరై క్లాసులు భోధించినట్లు సంతకాలు చేయడం ఉన్నత విద్యావంతునిగా సిగ్గుచేటు అని అన్నారు, ఒక భాద్యత కలిగిన ప్రొఫెసర్ గా మరియు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా అవార్డు పొందిన వ్యక్తి అకాడమిక్స్ మరియు యూనివర్సిటీకి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి కనీసం నియమ నిబంధనలు మరిచిపోయి యూనివర్సిటీ యెక్క ప్రతిష్టతను దిగజార్చే విధంగా వ్యవహరించడం అతని యొక్క విజ్ఞతకు నిదర్శనం అన్నారు, ప్రస్తుత విసిగా కొనసాగుతున్న వారి యొక్క సహకారంతో యూనివర్సిటీలోని ముఖ్యమైన భాగాలైన ఎగ్జామినేషన్ బ్రాంచ్ కంట్రోలర్ గా మరియు యూనివర్సిటీ ప్రెస్ ఇన్చార్జిగా కొనసాగుతూ ఇలాంటి బాధ్యతాయుతమైన పద్ధతులను పక్కనపెట్టి తప్పుడు సంతకాలతో 2023 డిసెంబర్ నెలలో కొన్ని తేదీలలో విధులకు హాజరు కాకుండానే హాజరైనట్టు చూయించి డిసెంబర్ నెల యొక్క వేతనాన్ని పొందడం చాలా సిగ్గుచేటు అని దీనివల్ల యూనివర్సిటీకి మచ్చ తెచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఇలాంటి తప్పుడు విధానాలు ఆలంబిస్తున్న వ్యక్తి భవిష్యత్తు లో విద్యార్థులకు,విద్యాభివృద్ధికి, యూనివర్సిటీ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు విధానాలు జరగకుండా ఉన్నతాధికారులు వివిధ డిపార్ట్మెంట్ లలో కూడా పర్యావేక్షించి లోపాలని అధిగమించి భవిష్యత్తులో మంచి అకాడమిక్స్ అడ్మినిస్ట్రేషన్ కల్పించాలని కోరారు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో అక్రమాలకు పాల్పడిన ప్రొఫెసర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని మంచి అకాడమిక్ వాతావరణం నెలకొల్పాలని లేనియెడల దశల వారి కార్యక్రమాలకు శ్రీకారం చూద్దామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పోతురాజు రాము, కొండారెడ్డిపల్లి శేఖర్,మామిడాల రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking