అప్పులు తీర్చలేక కూలీ డబ్బులు సరిపోక కుటుంబ పోషణ బారమై ఆత్మహత్య

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 20 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామానికి చెందిన తేజావత్ బాపులాల్ అనే 40సంవత్సరాల వ్యక్తి తేది 2024-01-19 రోజున రాత్రి 10గంటలకు ఇంటి ప్రక్కన ఉన్న కొట్టంలో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకుని మృతి చెందినాడు.మృతునికి గతంలో ఇద్దరు పెండ్లి అయి ఇద్దరు పిల్లలు జన్మించినాక బార్య చనిపోవడంతో మరోక వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న బార్య చంద్రకళకు కూడా మరో ఇద్దరు పిల్లలు జన్మించినారు.మృతుడు కూలీ పని చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకునేవాడు.కూలీకి వచ్చిన డబ్బులు సరిపోక కుటుంబ పోషన బారమై సుమారు 3 లక్షల వరకు అప్పులు చేసాడు. చేసిన అప్పులు తీర్చలేక కూలీ పనికి వచ్చిన డబ్బులు సరిపోక కుటుంబ పోషణ బారమై ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతుని బార్య చంద్రకళ పిర్యాదురాలు మేరకు కేసు దర్యాప్తు అధికారి రామయ్య,లక్షెట్టిపేట ఎస్సై ఎస్.లక్ష్మన్ తెలుపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking