ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 01 : మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఎర్రబెల్లి ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం బుధవారం చేశారు.అనంతరం ఏవో కు మెమోరాండం అందజేయడం. జరిగినది.గూడెం లిఫ్ట్ మరియు కడెం కాలువ ద్వారా దండేపల్లి, లక్షెట్టిపేట,హజీపూర్ మండలాల పంటలకు సాగు అందించాలని, గూడెం లిఫ్ట్ పైప్ లైన్లు తక్షణమే మార్చాలని,సాగు నీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25 వేల రూపాయల నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి మాట్లాడుతూ….ఎమ్మెల్యే దివాకర్ రావు చేతగానితనం వల్లనే మంచిర్యాల అసెంబ్లీ పంటలకు నీరు అందక రైతులు నష్టపోతున్నారు.గూడెం లిఫ్ట్ పైపు లైన్లు మారుస్తామని రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని రఘునాథ్ అన్నారు.బిజెపి పార్టీ సీనియర్ నాయకులు గుండా ప్రభాకర్,బొప్పు సత్తీష్,మధు, శ్రీరామ్,రేవంత్,మల్లారెడ్డి,సత్తీష్,తదితరులు పాల్గొన్నారు.