జర్నలిజం విలువలతో ప్రజలకు నమ్మకమైన వార్తలు వ్రాయాలి హైదరాబాద్ మార్చి : 1 తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ ఆవిష్కరణ సబాలో
జర్నలిస్టులే ప్రతిపక్ష పాత్ర పోషించాలని, దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2023 డైరీ ఆవిష్కరణ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, అమ్మ న్యూస్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి గార్లతో కలసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల చేతిలో ఉన్న కెమెరా ఏకే 47 అని దాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తే అక్రమార్కులకు చెమటలు పడతాయి అన్నారు. గతం లో ఉన్న విధంగ విలువలతో పని చేస్తలేరని కొంత మంది రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ ఉన్నారని జర్నలిజం విలువలతో ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నారు.గతం లో కెసిఅర్ తో దూరం ఉన్న అల్లం ఇప్పుడు బెల్లం అయ్యిండని ఏడ్డేవ చెసారు. తెలంగాణ వస్తే జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అక్రిడేషన్ కార్డులు వస్తాయని అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. జర్నలిస్టులకు ఏ సమస్యలు వచ్చినా తాను వారి పక్షాన ఉండి పోరాటం చేసేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్లు ఇయాలనే ఉద్దేశం ఉంటే ఎనిమిది సంవత్సరాలుగా ఇవ్వకుండా నాన్సుడు దూరంతో ఉండరని ఆయనకు జర్నలిస్టు లకు ఒక గజం భూమి కూడా ఇచ్చే ఆలోచన లేదన్నారు. పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామని అదే పోరాట స్ఫూర్తితో జర్నలిస్టులకు హక్కులు సాధించుకోవచ్చని దానికోసం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్ట్ యూనియన్ లో ఉన్న సభ్యులు గుప్పెడు మందైనా సైనికులతో సమానమని పోరాటాలకు వెనకాడ లేదన్నారు. అమ్మ న్యూస్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం హెల్త్ కార్డు ల తో పాటు ఫ్రీ విద్యా అందించాలన్నారు. నిజాలు రాసే జర్నలిస్టులకు అనేక సమస్యలు ఉంటాయని ఆ ధైర్యం శాశ్వతం కానీ ఆ సమస్యలు తాత్కాలికమన్నారు.
జర్నలిస్టులు దేనికి బయపడొద్దని అన్నారు. ప్రభుత్వము వృత్తి నైపుణ్యం కలిగిన జర్నలిస్టులకు మంచి స్కీం తీసుకురావాల్సినదిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత్ టుడే చైర్మన్ గురువారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం దిగిపోతేనే జర్నలిస్టులకు మంచి రోజులు వస్తాయని అక్కడ యాజమాన్యాలు జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఐ అఫ్ డబ్లు జే జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోడిశెట్టి రమేష్ , దాసన్న రాష్ట్ర కార్యదర్శి దశరథ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాపూరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫస్యుద్దీన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డి. అశోక్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షులు భూపతి రాజు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా, జనగాం జిల్లా అధ్యక్షులు రమేష్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు వడ్ల రాజేందర్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, గండ్ర నరేంద్ర, సిద్ధల రవి, పినాకిని మీడియా అధినేత వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.