నార్కట్ పల్లి డిపో అసిస్టెంట్ మేనేజర్ వెంకటమ్మ గారు నార్కట్ పల్లి డిపో పరిసర ప్రాంత ప్రజలకు ప్రతి పల్లె పల్లెకు వికలాంగుల బస్సు పాస్ మేళా సదస్సును నిర్వహించి , వికలాంగులకు 50 శాతం రాయి రాయితీతో కూడిన బస్సు పాసులను అందజేయుచున్నారు.
ఇందులో బాగంగా
బుధవారం రోజున కక్కిరేణి గ్రామంలో వికలాంగుల బస్ పాస్ మేళా సదస్సు గ్రామ పంచాయతీ ముందు నిర్వహించడం జరిగిందనీ టి ఎస్ ఆర్ టి సి నార్కట్ పల్లి డిపో పి. యాచ్.సి క్యాంప్ ఇన్ చార్జి బోయపల్లి భూషణ్ గారు తెలిపారు..
అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వికలాంగులు ఆర్టీసీ సేవలని సద్వినియోగం చేసుకోవాలని , వివాహా శుభకార్యాలకు మరియు వివిధ తీర్థ యాత్రలకు ఆర్టీసీ బస్సులలో బుక్ చేసుకున్న వారికి ప్రైవేటు బస్సుల వారి కన్నా తక్కువ ఛార్జీతో 10 / శాతం రాయితీ కల్పిస్తూ బస్సులను అద్దెక్కి ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు..
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త వేముల సైదులు, వికలాంగుల గ్రామ సంఘం కార్యదర్శి కన్నెబోయిన సత్యనారాయణ , మహెందర్ , సోమనబోయిన దుక్కేందర్ , కట్ట రమేష్ , మాండ్ర నరసింహ , చిల్ల రమాదేవి , చిక్కుల లక్ష్మి , భాష బోయిన పద్మ , యాదమ్మ తదితరులు పాల్గొన్నారు…