కుల్బుల్లాపూర్ ప్రజాబలం ప్రతినిధి:ఎమ్మెల్యే వివేకానంద ప్రగతి యాత్ర చేసిన మోకాళ్ళ మీద యాత్ర చేసిన కుత్బుల్లాపూర్ లో బిజెపి గెలుపును ఆపలేరని మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజెపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జాయింట్ కన్వీనర్ రాము గౌడ్ ల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి షాపుర్ నగర్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశాల విజయోత్సవ ముగింపు సభకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్ గారు, కూన శ్రీశైలం గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెందారో లేదో కానీ.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాత్రం కోట్ల రూపాయలు సంపాదించి అభివృద్ధి చెందాడని అన్నారు. ఎమ్మెల్యే తన జీతాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కొరకు ఉపయోగిస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 59 జీవో కింద పెద్ద మొత్తంలో చెల్లించాలని నోటీసులు అందుకున్న వారికి న్యాయం చేయకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.నియోజకవర్గంలోని పేదలకు ఎనిమిదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అయినా మంజూరు చేయలేదని కేసీఆర్ దగ్గర కొట్లాడి, ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించే దమ్ము ఎమ్మెల్యేకు లేదని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ… ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఉద్యోగులని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఆధిపత్య పోరుకు దిగుతున్నారని, ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి పైసల పంచాయతీ తప్ప ఏమి లేదని అన్నారు.కేసీఆర్ పంపిన డబ్బుల కట్టలతో గెలుస్తానని పది కార్లు వెస్కొని రంగేళి రాజా లాగా ఎమ్మెల్యే తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
స్ట్రీట్ కార్నర్ సమావేశాల కు ప్రజల నుండి వచ్చిన స్పందన చూసి బీఆర్‌ఎస్ నేతల్లో దడ పుట్టిందని,ఎమ్మెల్యే ప్రగతి యాత్ర చేసిన… మోకాళ్ళ మీద యాత్ర చేసిన కుత్బుల్లాపూర్ లో బీజేపీ గెలుపును ఆపలేరని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రావడం వల్లే దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉగ్రవాదుల దాడులతో ఎంతోమందిని కోల్పోయామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదం తెలంగాణ పై ఉందని, తెలంగాణలో బిజెపి ప్రభుత్వం కచ్చితంగా వచ్చి తీరుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని, అనేక సర్వేలు కూడా తేట తెల్లం చేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బక్క శంకర్ రెడ్డి, రాజిరెడ్డి, బావిగడ్డ రవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జే కే శేఖర్ యాదవ్, సదానందం, పత్తి రఘుపతి, ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యాం రావు, జిల్లా అధికార ప్రతినిధులు మేకల సురేష్ రెడ్డి, రాజేష్ మిశ్రా, జయశంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి జగన్, కొంపల్లి మున్సిపల్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ అధ్యక్షులు ఆకుల సతీష్, డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, పున్నారెడ్డి, పత్తి సతీష్, దుర్యోధనరావు, కంది శ్రీరాములు, రాజేశ్వరరావు, పులి బలరాం, డివిజన్ ఇంచార్జ్ లు మోతే శ్రీనివాస్, కృష్ణ యాదవ్ సుశాంత్ గౌడ్, బిల్లావెంకటేష్ రాజిరెడ్డి, శ్రీధర్ వర్మ, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అరకల సుధా తదితరులు పాల్గొన్నారు
అనంతరం గిరిజన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మృతి పట్ల సంతాప వ్యక్తం చేస్తూ, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్ బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి షాపూర్ నగర్ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు.
ప్రీతి మృతి పట్ల హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు