చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

మణికొండ ప్రజాబలం ప్రతినిధి: మనికొండ కౌన్సిల్‌ లో గల 20 వార్డ్‌ లకు గాను కాంగ్రెస్‌ 8, బీ జే పీ 6, బీ ఆర్‌ ఎస్‌ 5 మరియు స్వతంత్రులు 1 గా ఉన్నారు, ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్‌, బీ జే పీలు జత కలుపుకుని ఛైర్మన్‌ వైస్‌ చైర్మన్‌ పదవులు చేపట్టి మున్సిపాలిటీని ముందుకు సాగతీస్తూన్నారు, ఇట్టి పరిస్థితులలో చిన్న విషయమై బీ జే పీ వైస్‌ చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి కలుగ జేసుకొని కమ్మ కుల కౌన్సిలర్‌ ప్రతినిధి ఆలస్యం నవీన్‌ కుమార్‌ ను ప్రత్యక్షముగా వినడానికి వీలులేని రీతిలో నానా బూతులు తిట్టుతున్నను స్పందించ నందుకు ఇంకా కక్షతో ఎక్కడి నుంచో వట్చి మా బిక్షతో కౌన్సిలర్‌ అయ్యి మున్‌ ముందు ఎలా బ్రతుకుతావో అని ఒక రకమైన హెచ్చరిక చేసినాడు, అందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తనకు రక్షణ కల్పించాలని పోలీస్‌ వారిని కోరడం జరిగినది, అట్టి కాపీ ని మునిసిపల్‌ కమిషనర్‌ కు అందజేయడం జరిగింది. ఆలస్యం నవీన్‌ కుమార్‌ వార్డ్‌ 8 కౌన్సిలర్‌.

Leave A Reply

Your email address will not be published.

Breaking