బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్క వెంకట్ యాదవ్
హైదరాబాద్ మార్చ్ 1 ();హైదరాబాద్ నర్సింగ్ లోని శ్రీ చైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ మృతికి కారణమైన కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్క వెంకట్ యాదవ్ డిమాండ్ చేసారు. నేడు బిసి భవన్ లో మీడియా తో మాట్లాడుతూ అలాగే విద్యార్థి కుటుంబానికి కళాశాల యజమాన్యం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని కటినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యులను కటినంగా శిక్షించాలన్నారు. చైతన్య కళాశాల వ్యాపార జ్వాలలో మరో విద్యార్ధి సాత్విక్ మృతి చెందిన నేడు అప్రతిహత దాఋణాలపై స్పందించకపోవడం, చర్యలు తీసుకో పోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైతన్య, నారాయణ తదితర కార్పొరేట్ సంస్థల ఈ అరాచకాలను నియత్రించడానికి అందుబాటులో మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి ఈ దురాగతాలకు అవకాశాలను కొనసాగించే ప్రభుత్వ విధానాలను తక్షణమే పునః సమీక్షించుకొని తగు చర్యలు ఇప్పటికైనా తీసుకోకపోతేతగు మూల్యం అనివార్యమని ఆయన తెలిపారు.గత రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణలోని మధ్యతరగతి ప్రజలు పాలిట శాపమై వారి రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న ఇటువంటి విద్యాసంస్థలను కొనసాగించడంపై ప్రభుత్వం తక్షణమే కఠిన మార్గదర్శకాలు రూపొందించడమే కాకుండా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశం లో వెంకటేష్, బాలాజీ, సంతోష్, దత్తు పాల్గొన్నారు.
Prev Post
బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా మంజురు అయిన బీమా రెండు చెక్కు ను అందచేసిన బిఆర్ఎస్ నాయకులు
Next Post