అధ్యక్షా బరిలో బాలయ్య,
ప్రధాన కార్యదర్శి బరిలో గార్లపాటి సురేష్ కుమార్.
ఓటు హక్కు వినియోగించుకోనున్న 80 మంది న్యాయవాదులు.
మెదక్ మార్చ్ 25 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 28 గురువారం జరగనున్నాయి. ఈమేరకు అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అధ్యక్ష స్థానానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. అభ్యర్థులు కరపత్రాలు, వాట్సప్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అధ్యక్ష స్థానానికి యం. బాలయ్య, సుభాష్ చంద్రగౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఏ. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి స్థానానికి.. గార్లపాటి సురేష్ కుమార్, శ్రీపతి రావు రంగంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 80 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గురు వారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ తర్వాత ఓట్లు లెక్కింపు.. ఫలితాల వెల్లడి ఉంటాయని ఎన్నికల అధికారి ప్రభాకర్ తెలిపారు. అనంతరం మీడియాతో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అభ్యర్థి గార్లపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ సీనియర్, జూనియర్ , నాతోటి న్యాయ న్యాయవాదులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరితో నేను కలిసి మెలిసి ఉంటానని,
ఈనెల 28 ఎన్నికల నిర్వహణతో పాటు , అదేరోజు ఫలితాలు విడుదలవుతాయని, 22 సంవత్సరాలుగా మెదక్ లో న్యాయవాదిగా పనిచేస్తున్న తనను జనరల్ సెక్రెటరీ గెలిపించాలని, న్యాయవాదులు అందరికీ అందుబాటులో ఉంటానని, మీరు నాకు సహకరించి జనరల్ సెక్రెటరీ ఎన్నుకోవాలని , మీకు రుణపడి ఉంటాననీ, తన తోటి న్యాయవాదులు అందరూ తన గెలుపు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.