ఖమ్మం ప్రతినిధి మార్చి 25 (ప్రజాబలం) ఖమ్మం పోలీసు హెడ్ క్వార్టర్స్ లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సమక్షంలో పోలీసు సిబ్బంది రంగులు జల్లుకుంటూ సందడి చేశారు. పోలీస్ బ్యాండ్ చప్పుళ్లతో హెడ్ క్వార్టర్స్ దద్దరిల్లి పోయింది పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట ఉన్న కవాతు మైదానంగా అధికారులు, సిబ్బంది కలిసి నృత్యాలు చేశారు. ఈ ఉత్సవాల్లో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్, ఏఆర్ ఏసీపీలు నర్సయ్య సుశీల్ సింగ్, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు కామరాజు శ్రీశైలం సురేష్ అప్పలనాయుడు సిఐలు రమేష్ శ్రీహరి ఇతర అధికారులు చేతులు కలిపి ఉత్సాహంగా సందడి చేశారు
